School : నులి పురుగుల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్
ప్రధానంగా ఒకటి నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు నులి పురుగుల నిర్మూలన యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకుంటామని తెలిపారు.
జయభేరి, ఉప్పల్ :
ఈ వ్యాధి వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వలన, వండిన మరియు కలుషితమైన ఆహారం , స్వీట్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వంటి వివిధ కారణాలవల్ల పిల్లల్లో వార్మ్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని అన్నారు. అందుకే ప్రతి సంవత్సరం ప్రభుత్వం ద్వారా రెండు దఫాలుగా ఈ నూలి పురుగుల నివారణ కొరకై ఈ టాబ్లెట్లను పిల్లలు తప్పకుండా వేసుకోవాలని అన్నారు. అనంతరం నూలి పురుగుల నివారణకు టాబ్లెట్లను పిల్లలకు అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ సూపర్వైజర్ భోగా ప్రకాష్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆదినారాయణ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎదుల కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్, మాస శేఖర్ ,బింగి శ్రీనివాస్, హనీఫ్,శైనజ్, సత్యవతి, శారద, శ్యామ్, స్కూల్ టీచర్స్, PHC ఏఎన్ఎంలు ఆశాలు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మొదలగు వారు పాల్గొన్నారు.
Post Comment