TS Election : పెరిగిన ప్రచార హోరు.. సొమ్ము చేసుకుంటున్న జనాలు...
- నేతల తాకిడితో భాగ్యనగరం అట్టుడికి పోతున్న వేళ... ఒక స్టాండ్ చెయ్ నుంచి పల్లె దాకా ప్రజలు చాలా బిజీగా ఉన్నారు... ఎన్నికలు వస్తే చాలు పండుగ వాతావరణమే అన్నట్టుగా సాగుతున్న ప్రచార హోరు ఇప్పుడు ప్రజలకు కూలీ దొరికి కడప నిండా మెతుకులు తినే భాగ్యం దక్కింది. పొద్దున ఒక పార్టీకి జై కొడతానికి వెళ్తారు మధ్యాహ్నం మరొక పార్టీకి జై కొట్టడానికి వెళ్తారు సాయంత్రం ఇంకో పార్టీకి జేజేలు కొట్టడానికి వెళతారు. మొత్తానికి రోజుకు 1000 రూపాయలు సంపాదించుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది అన్న రీతిలో ఓటర్లు వలస కూలీలుగా మారిపోతున్నారు. మెజారిటీతో గెలుపొందల అనే ఉద్దేశంతో ఎంతటి నీచనికైనా జిగదారుతున్నారు... ఓటర్లదా తప్పు డబ్బులు పనిచేయని నాయకులదా తప్పు అసలు విషయం ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం 'జయభేరి' కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర రాజకీయ విశ్లేషణ...
జయభేరి, హైదరాబాద్ :
పార్లమెంటు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నా కొద్దీ పార్టీ అధినేతలు తెలంగాణలో బాగా వేసి ఎలాగైనా తెలంగాణలో ఎంపీ సీట్లు అత్యధిక మెజారిటీతో గెలవాలని రాజకీయ పార్టీ నేతల దగుల్ బాజీ పనికి పరాకాష్టగా మారుతుంది. స్వతంత్ర భారతావనిలో సంక్షేమ పథకాలు ఫ్రీగా అందిస్తున్నామంటే క్యూ కట్టే జనం తీరు చూస్తే జాలేస్తోంది.. ఆర్ధిక భారంతో చితికి పోతున్న ప్రజలు ఉచితలకు ఎగబడి క్యూ లైన్ లో రేషన్ షాప్ దగ్గర క్యూ కట్టే లైన్లు ఇందుకు సాక్ష్యం... ఒక ఉచిత పథకాలకి కాదు ఆయా పార్టీలు అధికారంలోకి రావడానికి ఎంతటికైనా దిగజారుడు పనులు చేసే వీలును కల్పిస్తూ ప్రజలను బిచ్చగాళ్లుగా చేస్తున్నారు.
ప్రజలది ముమ్మాటికీ అసలు కానే కాదు అని చెప్పవచ్చు. అలా అని ప్రజలు అంత అమాయకులు ఏమి కాదు.. రాజకీయ నాయకుని కంటే చాలా తెలివైనవారు. ఎందుకంటే వచ్చేది మేమెందుకు కాదంటాం గెలిచిన తర్వాత వాళ్ళు పెట్టిందంతా డబుల్ గా దోచుకోరా... అనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.. అంటే రాజకీయ నాయకులు మలిన పడిపోయారనేది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సామాజిక రాజకీయ విశ్లేషణ మనకంటే ఎక్కువగా ప్రజలే చేస్తారు.. మానుతున్న కాలానికి ప్రజలు మారుతున్నారు ఆర్థిక భారం పెరిగిపోతుంది ఇలాంటి తరుణంలో రాజకీయాలు కూడా మారుతున్నాయి ఆర్థికంగా ఖర్చు పెడితేనే గెలుస్తారు అనే నిజం నగ్నసత్యంగా బహిర్గత రహస్యంగా వెలుగుతోంది. ఎమ్మెల్యే గెలవాలంటే ఇంత ఖర్చు పెట్టాలి ఎంపీగా గెలవాలంటే ఇదిగో ఇంత ఖర్చు పెట్టాలి అనే విధంగా ఒక్కో సీటుకు ఒక్కో రేటు.. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అదే రీతిన పార్టీ అభ్యర్థులు అదే తోవలో పయనిస్తున్నారు.. ఎందుకు అనుగుణంగానే ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడానికి వలస కూలీలుగా ప్రచారంలో వాడుకుంటున్నారు.. ఓ బడా నాయకుడు వస్తుందంటే ఆ కాలనీలో ఉన్న మహిళలందరూ జనసంఖ్యను చూపించుకోవడానికి కూలీలుగా మాట్లాడుకొని మీటింగ్ కు 200 చొప్పున ఏ నాయకుడొచ్చినా అదే జనం కనిపిస్తున్నారు.. అంటే ఫలానా ముఖ్యమంత్రి కొడుకు వస్తున్నాడు ముఖ్యమంత్రి వస్తున్నాడు ఫలానా జాతీయ నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అక్కడ ప్రముఖ నాయకుడి మీటింగ్ ఉంది ఇలాంటి సందర్భాలలో చుట్టుపక్కల ఉన్న మహిళలను చోటా లీడర్లుగా చాలా మనవుతున్న మహిళలు కొందరు కాలనీలలో ఉన్న మహిళలని గ్రామాలలో ఉన్న మహిళలని చుట్టుపక్కల వాళ్లను అందర్నీ పోగేసుకొని ఈ ఒక్కొక్కరికి ఇంత చొప్పున డబ్బులు మాట్లాడుకొని ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకొని వచ్చి నిర్లజ్జగా ని సిగ్గుగా పైసలను పంచుతూ మీటింగులకు జరభాను సమీకరిస్తున్నారు..
నిజానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశించినట్టుగానే ప్రజలు ఎప్పుడైతే తెలివిగా ఆలోచించి తమ బ్రతుకులను బాగు చేసుకోవడానికి ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకుంటారో అప్పటివరకు నా పోరాటం ఆగదు అని అన్న మాటలు ఇప్పటికీ సజీవంగానే ఉంటున్నాయి...
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత పవిత్రమైందో ఎంత విలువయిందో ఈ ప్రజలకు తెలిసిన మారరు మారకుండా ఉండేలా చేసిన ఘనత ఆయా రాజకీయ పార్టీలది ఆయా నాయకులది...ప్రజలు ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకుంటారు ఒకవేళ ఓటు వేయకపోతే మేం జనాభా లెక్కలో లేమా..!? మా ఓటు ఎందుకు లేదు!? మా ఓటు ఎవరు వేశారు!? అంటూ ప్రశ్నించే తత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తెలిసినంతగా నగర పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి తెలియదేమో... అలా అని ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓటు వేయరు... వాళ్ళని డబ్బులు తీసుకునేలా చేసింది రాజకీయ నాయకులే... ఈ సో కాల్డ్ పార్టీ నేతలే... మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం మీకు అదృష్టం మీకు ఇది చేస్తాం అని చెప్పే దౌర్భాగ్యపు పాలనలో రాజకీయ నాయకులు వేసే ఉచిత పథకాలకు ప్రజలు బందీలుగా మారిపోయి బానిసలుగా బతుకుతున్నారు.
ప్రతిదీ డబ్బుతోనే కొనుక్కుందాం అనుకునే ఆలోచనలు ఇకనైనా మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అంటే స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో సాగేలా ఈ నాయకులకు తెలిసేలా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్న తీరుమారని నేతలను చూస్తే జాలేస్తోంది... గతంలో ఎంతోమంది ఉన్న ఆస్తులు అమ్ముకొని ఎలక్షన్ లో పెట్టి ఓడిపోయిన తర్వాత లబోదిపోమని మొత్తుకొని తిరిగి డబ్బులు ఇవ్వమని ప్రజల్ని అడిగిన దాఖలాలు లేకపోలేదు... అలా కాకుండా ఉన్న ఆస్తులు అమ్ముకొని రాజకీయంలో గెలిచి కోట్ల రూపాయలు సంపాదించుకున్న నేతలు లేకపోలేదు.. మొత్తానికి రాజకీయ ఎన్నికలు వచ్చాయంటే ప్రజలకు కొన్ని రోజులు పని దొరుకుతూ కడుపునిండా తిండి దొరికి నచ్చింది తాగే పరిస్థితి నేతలే కనిపిస్తున్నారు... ఇది ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలకు ఇచ్చిన వరము శాపము తెలియదు కానీ ఓటర్లు నీరు చాలా తెలివైన వాళ్ళు అని చెప్పక తప్పదు..
ఇప్పటికైనా ప్రజలు ఒకసారి ఆలోచించాలి తమ బాధ్యతను గుర్తించుకొని మారాలి అని అంటే ప్రజలు అర్థం చేసుకుంటారో తెలియదు కానీ రాజకీయాల నాయకులే మారిన క్షణాన ప్రజలు యధావిధిగా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళతారు. మొత్తానికి జీవులు నింపే పని రాజకీయ నాయకులు చేస్తుంటే నింపుకునే పని ప్రజలు చేస్తున్నారు.. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం అంటే ఇది కాదు. కనీస పరిజ్ఞానం లేని రాజకీయ నేతలు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి జాలేస్తోంది..
- కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
గాయకులు, సామాజిక ఉద్యమకారులు
Post Comment