ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి - సైబరాబాద్ డీసీపీ నితిక పంథ్
- పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తూముకుంట, మూడు చింతల పల్లి గ్రామాల్లో పోలీసుల కవాతు
జయభేరి, ఏప్రిల్ 29 :
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ డీసీపీ నితిక పంథ్ ఆదేశాల మేరకు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్, ఎస్సై లు, సిఐఎస్ఎఫ్ సిబ్బంది కలిసి తుంకుంట , మూడు చింతల పల్లి గ్రామాల్లో కవాతు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మరియు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని వారికి అవగాహన కల్పించారు. అదేవిధంగా ఏమైనా సమస్యలు తలెత్తిన తక్షణమే సమాచారం అందించాలని వారు సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరిగేందుకు అందరూ సహకరించాలని వారు కోరారు.
Latest News
విద్యాధరి ఆలయంలో మాజీ మంత్రి
07 Oct 2024 12:02:13
జయభేరి, గజ్వేల్ (వర్గల్) 07 : సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్...
Post Comment