నాయకులు ఎన్ని ప్రసంగాలు చేసినా సరే అది ప్రజలకు చేరాలంటే కేవలం మీ సోషల్ మీడియా ద్వారానే అది సాధ్యం.

  • యుద్ధ సమయంలో సైనికులకు వారి సెలవులను రద్దు చేసి యుద్ధంలో పాల్గొనమని చెప్తారు. ఇప్పుడు మనకు కూడా అలాంటి సమయమే.

నాయకులు ఎన్ని ప్రసంగాలు చేసినా సరే అది ప్రజలకు చేరాలంటే కేవలం మీ సోషల్ మీడియా ద్వారానే అది సాధ్యం.

జయభేరి, హైదరాబాద్: 
జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్, టిపిసిసి సోషల్ మీడియా స్టేట్ కో ఆర్డినేటర్ పెట్టెం నవీన్ నిర్వహించిన సోషల్ మీడియా ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, టిపిసిసి మీడియా & కమ్యూనికేషన్స్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ర్ట కార్యదర్శులు, జిల్లా కోఆర్డినేటర్లు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, మండల, గ్రామ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

GMFXnYQaUAAJhBB

Read More Telangana I మును గో.. డౌట్..

ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పార్టీని అధికారంలో దిగడానికి ఎంతో కృషి చేశారు. నాయకులు ఎన్ని ప్రసంగాలు చేసినా సరే అది ప్రజలకు చేరాలంటే కేవలం మీ సోషల్ మీడియా ద్వారానే అది సాధ్యం. మీరంతా కలిసికట్టుగా పని చేశారు... కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. ఒక యుద్ధం చేయబోతున్నాం. యుద్ధ సమయంలో సైనికులకు వారి సెలవులను రద్దు చేసి యుద్ధంలో పాల్గొనమని చెప్తారు. ఇప్పుడు మనకు కూడా అలాంటి సమయమే. ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధంలో పాల్గొని విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Read More Telangana I గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) 42వ వన భోజన కార్యక్రమం

GMFXnyiagAAuj7i

Read More Medigadda I మేడిగడ్డ.. బొందల గడ్డ... భాష మార్చుకోకపోతే ప్రజలు చీదరిస్తారు!

Views: 0