Nagababu : వైరల్ అవుతున్న నాగబాబు ట్వీట్
నాగబాబు ట్వీట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ చేసినది అని పలువురు నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ఏపీ ఎన్నికలు జరిగాయి.
జయభేరి, హైదరాబాద్ , మే 14 :
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, అలాగే రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తి అయ్యాయి. అధికారంలోకి వైసీపీ పార్టీ తామే మరోసారి పగ్గాలు చేపడతామని ధీమాగా ఉంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు చెందిన కూటమి తాము అధికారంలో రావడం ఖాయమని, ఏపీ ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకు అనుగుణంగా తమకు ఓటు వేశారని బలంగా చెబుతున్నారు. ఎవరు అధికారంలోకి వస్తారు? అనేది పక్కన పెడితే... జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీలో క్రియాశీలక సభ్యులు కొణిదెల నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో కాక రేపుతోంది.''మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడు అయినా పరాయివాడే. మాతో నిలబడే వాడు పరాయివాడు అయినా మావాడే...!'' అని సోమవారం రాత్రి నాగబాబు ట్వీట్ చేశారు. అంతకు మించి ఆయన ఏమీ పేర్కొనలేదు. పైగా, ఏపీలో పోలింగ్ అంతా ముగిశాక రాత్రి పది గంటల సమయంలో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆయన ఎవరిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారనేది హాట్ టాపిక్ అయ్యింది.
ఆ అభిమానుల ఆకాంక్షలకు అనుగుణంగా నాగబాబు ట్వీట్ చేశారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ తమ కుటుంబ సభ్యుడు అయినా సరే తమకు పరాయివాడి కింద లెక్క అన్నట్టు ఆయన ట్వీట్ చేశారని, ఆ పోస్టులో నిగూఢ అర్థం అదేనని అనలిస్టులు సైతం ఆఫ్ ది రికార్డ్ కామెంట్ చేస్తున్నారు. అది పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేత వర్మను ఉద్దేశించి చేసిన ట్వీట్ అని కొందరు చెబుతున్నారు. నాగబాబు ట్వీట్ వెనుక ఏ ఉద్దేశం ఉందనేది ఆయనకు మాత్రమే ఎరుక.
Post Comment