సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు

సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు
జయభేరి, ఎల్బ్ నగర్ : మట్టి దిబ్బలు కుప్పకూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో జరిగింది. ఓ భవనం సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు కూలటంతో ఈ ప్రమాదం జరిగింది.
 

మృతులు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం మల్లు పల్లి గ్రామం ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూలీలు వీరయ్య(50), రాము(20), శ్రీనివాస్(19) గుర్తించారు. మరో కార్మికుడు బిక్షపతి(33) తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

ప్రాథమిక వివరాల ప్రకారం…. ఓ భవన నిర్మాణానికి సంబంధించి సెల్లార్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పలువురు కార్మికులు పని చేస్తున్నారు. మట్టిని తవ్వుతుండగా…. మట్టి దిబ్బలు ఒక్కసారిగి కుప్పకూలాయి. దీంతో ముగ్గురు కార్మికులు స్పాట్ లోనే చనిపోయారు. మట్టి దిబ్బలను తొలగించి వారి మృత దేహాలను బయటికి వెలికి తీశారు. వీరంతా కూడా ఖమ్మం జిల్లా కు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. 

Read More డిఈవోను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

Screenshot_2025-02-05-14-40-09-89_99c04817c0de5652397fc8b56c3b3817

Read More హరీష్ రావు పై అక్రమ కేసులు తగవు

సంఘటన స్థలాన్ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి :... స్థానిక ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసినారు. జిహెచ్ఎంసి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని గుర్తు చేశారు.. ఈ సంఘటనకు నైతిక బాధ్యత  బిల్డర్, అధికారులు వహించాలని కోరారు.. చనిపోయిన మృతులకు ఒక్కొక్కరికి 25 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషన్, గాయపడిన వ్యక్తికి 10 లక్షలు చొప్పున ఇవ్వాలని కోరుతున్నారు. 

Read More క్షయ వ్యాధి పట్ల  అప్రమత్తంగా ఉండాలి.