పీహెచ్సీలో పశువుల సంచారం
కొరవడిన పారిశుద్ధ్యం
మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పశువుల సంచార నిలియంగా మారింది. పారిశుద్ధ్యం కొరవడంతో పశువులు ఆరోగ్య కేంద్రం ఆవరణంలో సంతరిస్తున్నాయి.
ఆ ఆస్పత్రి ఆవరణంలోనే పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టని వైద్య సిబ్బంది జనాలకు తమ ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని హిత బోధ చేయడం విడ్డూరంగా ఉందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే క్రమం ఉన్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అందరికీ వైద్యం, పారిశుధ్యం సమస్యలు తలెత్తకుండా వైద్య సేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Views: 0


