Modi : కాంగ్రెస్ సీట్ల కోసం వెతుకులాట
- ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళిని, రామప్ప శివుడికి దండం పెట్టుకొని ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 40 ఏళ్లక్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు.
జయభేరి, వరంగల్, మే 8 :
ఎన్డీయే విజయం మొదటి మూడు విడతల్లోనే తేలిపోయిందన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ సీట్లు వెతుక్కోవడానికి మైక్రోస్కోప్ కావాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళిని, రామప్ప శివుడికి దండం పెట్టుకొని ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 40 ఏళ్లక్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. ఈ ప్రాంతం కాకతీయుల విజయానికి ప్రతీక అన్నారు. వరంగల్ చారిత్రాత్మకమైన సీటు అని కొనియాడారు. భావితరాల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే మళ్ళీ బీజేపీ రావాలన్నారు. ఫిర్ ఎక్ బార్.. మోడీ సర్కార్ అని నినదించారు. ప్రపంచమంతా అనేక విపత్తులు ఎదుర్కుంటుందని.. దేశం దృష్టశక్తుల చేతుల్లోకి వెళ్లకూడదన్నారు.10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఎలాంటి పాపలు చేసిందో ప్రజలు మరిచి పోలేదని గుర్తు చేశారు. కుంభకోణాలు.. బాంబ్ బ్లాస్టింగ్స్ కాంగ్రెస్ పాలనలోనే జరిగాయన్నారు. కూటమి ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు అవుతారని ఎద్దేవ చేశారు. ఈ దేశాన్ని అలాంటి వారి చేతుల్లో పెడదామా..? అని ప్రశ్నించారు. ప్రతీ పార్టీకి ఒక ప్రధానమంత్రి అభ్యర్థి ఉన్నారని.. ఏడాదికి ఓ ప్రధాని చొప్పున ఉంటే ఈ దేశ భవిష్యత్ ఏమై పోతుందో ఆలోచించండని సూచించారు. ఇండియా కూటమికి చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు కోరు అని విమర్శించారు. లోక్ సభ ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ రుణమాఫీ వట్టి మాటే అని తెలిపారు.
అంబానీ, ఆదానీ నుంచి ఎంత తీసుకున్నారు
అంబానీ, అదానీని ఇన్నాళ్లూ విమర్శించారు.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ విమర్శలు ఆగిపోయాయి.. అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది..? అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చారు.. అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుందని ప్రశ్నించిన ప్రధాని మోదీ.. ఈ గుట్టలకొద్దీ డబ్బు గురించి సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. వేములవాడలో నిర్వహించిన బీజేపీ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు సంధించారు. బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఫ్యామిలీ ఫస్ట్ అంటూ పేర్కొన్నారు. రెండు పార్టీలు ఒక్కటేనని.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను అవినీతే కలుపుతోందన్నారు. కాంగ్రెస్‌పై ఓటుకు నోటు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్..అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం స్కామ్‌పై చర్యలు తీసుకోవట్లేదు.. అవినీతి సిండికేట్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ భాగస్వాములు అన్నారు.పీవీని కాంగ్రెస్ అవమానించింది..కాంగ్రెస్, BRS వారి కుటుంబాల కోసమే పనిచేస్తాయి.. దేశమే ముఖ్యమని భావించే పార్టీ బీజేపీ అని మోదీ అన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావును కాంగ్రెస్ అవమానించిందని.. పీవీ భౌతికకాయాన్ని పార్టీ ఆఫీస్‌లోకి అనుమతించలేదంటూ మోదీ మండిపడ్డారు. పీవీకి తమ ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించిందని మోదీ అన్నారు.ఈ సందర్భంగా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు గండికొట్టి.. కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్‌కు ఇవ్వాలనుకుంటోందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై కాంగ్రెస్ చిన్నచూపు చూస్తుందని. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలతో ఓబీసీలకు నష్టమని మోదీ అన్నారు.
Post Comment