తుంకుంటలో చోరి జరిగిన బంగారు దుకాణాన్ని సందర్శించిన మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి

కేసు విచారణను వేగవంతం చేసి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశం

తుంకుంటలో చోరి జరిగిన బంగారు దుకాణాన్ని సందర్శించిన మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి

జయభేరి, ఆగస్టు 9:-మేడ్చల్ జిల్లా తుంకుంట మున్సిపాలిటీలోని కృష్ణ జ్యువలరీ షాపులో మంగళవారం రాత్రి చోరి జరిగింది. అయితే ఘటన స్థలాన్ని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్ కలసి సందర్శించారు. చోరి జరిగిన తీరును పరిశీలించారు.

అదేవిదంగా దుకాణంలో పనిచేసే సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ చోరి కేసు విచారణను వేగవంతం చేసి సాధ్యమైనంత తొందరగా నేరస్తులను పట్టుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ ఏసిపి రాములు, సీఐ శ్రీనాథ్, డీ ఐ నర్సింహరాజు తదితరులు పాల్గోన్నారు.

Read More Congress I లెక్కలు తేల్చాల్సిందే...

Views: 0