KTR : బిజెపికి ఓటు వేయడానికి సిగ్గుపడాలి

దేవుళ్ళ పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుంది -  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

  • వలస పక్షులకు ఓటు అడిగే హక్కు లేదు
  • మల్కాజ్ గిరి బీఆర్ ఎస్ అభ్యర్థి గా రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్, పాల్గొన్న బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమీ లేదు
  • కాంగ్రెస్, బీజేపీ లు కలిసి బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారు

KTR : బిజెపికి ఓటు వేయడానికి సిగ్గుపడాలి

జయభేరి, ఏప్రిల్ 22:
దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేసే పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని, అలాగే వలస పక్షులకు ఈ ప్రాంతంలో ఓటు హక్కు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సారి ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని ఆయన ప్రజలకు సూచించారు. మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం తుంకుంట మున్సిపాలిటీ లోని దొంగల మైసమ్మ వద్ద గల ఓ వెంచర్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్నర్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. గత పదేళ్లుగా బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని పెట్రోల్, డిజిల్, నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెంచి మధ్య తరగతి ప్రజలను నిలువెల్లా మోసం చేశాడని ఆరోపించారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం హైద్రాబాద్ లో 36 ఫ్లైఓవర్లు నిర్మిస్తే బిజెపి ప్రభుత్వం రెండు ప్లైఓవర్లు కూడా కట్టలేదని  విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేశారా అని ప్రశ్నిస్తే జై శ్రీరామ్ అంటున్నారని, రాముడితో మాకు ఏలాంటి పంచాయతి లేదని అయితే దేవుడి పేరుతో బిజెపి రాజకీయం చేస్తుందని విమర్శించారు.తాము కూడా  ఆలయాలు నిర్మించి పూజలు చేశామని.. ప్రధాని మోదీ ఇంటింటికి అక్షింతలు పంపిస్తే కేసిఆర్ దేశానికి 3.5 కోట్ల బియ్యాన్ని పంపిణి చేశారని గుర్తు చేశారు. నల్లధనం వెలికి తీస్తానని ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ. 15 లక్షలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, ఇళ్లు లేనివారికి ఇళ్లు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మాట ఇచ్చి మోసం చేసి గద్దెనెక్కింది మోదీ కాదా అని ప్రశ్నించారు.

Read More గురుకుల తరహాలో విద్యాభ్యాసం

మోదీ వచ్చిననాడు సిలిండర్ ధర రూ.400 ఉంటే ప్రస్తుతం 1100 అయిందని, నిత్యావసర ధరలు, ప్రయాణ చార్జీలు పెంచిన మోదీ ప్రియమైన మోదీ కాదని పిరమైన ప్రధాని అని మండి పడ్డారు. మల్కాజ్ గిరి ప్రజలు ఆశీర్వదించి రేవంత్ రెడ్డిని ఎంపిగా గెలిపిస్తే ఇక్కడి ప్రజలకు ఏమి చేసిందేమి లేదని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచి మొదటిసారి మోసం చేశాడని, మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిచి మరోసారి ప్రజలను మోసం చేశాడని, మోసం చేయడం ఆయన నైజమైతే మోసపోవడం మన వంతా అని ప్రశ్నించారు. కేంద్రంలో బడేబాయ్, రాష్ట్రంలో చోటేబాయ్ అన్నట్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఏవి  అమలు చేయలేదని, 12 ఎంపి స్థానాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే రాష్ట్ర రాజకీయాలను కేసిఆర్ శాసిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఎ కూటమికి 200 సీట్లు దాటవని, ఇండియా కూటమికి 150 సీట్లు రావని జోస్యం చెప్పారు. అందుకే బిఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు ఇస్తే మనల్ని వారే బతిమాలుకుంటు వస్తారని చెప్పారు.

Read More రేవంత్ రెడ్డి కి ఓటు వేసి తప్పు చేశాం అంటున్న ప్రజలు....

a2af0e20-73b1-4699-ab8b-128cb503731a

Read More పెట్రోల్ ధరల పెంపు? తప్పదా?

రాష్ట్రంలో చాల చోట్ల మోదీకి మేలు చేయడానికి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందన్నారు. బిజెపిని అడ్డుకునే దమ్ము దైర్యం ఒక్క కేసి ఆర్ కే ఉందన్నారు. 2014, 2019లో బిజెపిని అడ్డుకుంది ఒక్క బిఆర్ఎస్ అని గుర్తు చేశారు. కొందరు బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేస్తున్నారని అలా ఒక్కటైతే కేసిఆర్ కూతురు జైల్లో ఉండేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చెప్పిన పథకాలు అమలు కావాలంటే బి ఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎంఎల్ఎలు చామకూర మల్లారెడ్డి, వివేకనందా, కృష్ణరావు. బండారి లక్ష్మారెడ్డి. రాజశేఖర్ రెడ్డి, సుదీర్ రెడ్డి ఎంఎల్సీలు శంబీపూర్ రాజు, వాణిదేవి. నందికంటి శ్రీధర్, తుముకుంట మున్సిపల్ చైర్మన్ కారంగుల రాజేశ్వరరావు, తూముకుంట మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్ రెడ్డి,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... ఏసీబీ అధికారులకు చిక్కిన రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్