Sitarama Kalyanam : కల్యాణం కమనీయం... గుండ్లపోచంపల్లి కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం..

రామనామస్మరణతో మార్మోగిన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం..

Sitarama Kalyanam : కల్యాణం కమనీయం... గుండ్లపోచంపల్లి కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం..

జయభేరి, మేడ్చల్ :
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. నూతన  వధూవరులైన శ్రీ సీతారాములను విశేష అలంకరణలతో ఆలయ మండపంలోని కళ్యాణ వేదికపై ఆశీనుల్ని చేశారు.మామిడి తోరణాలు, విశేష పుష్పాలంకరణలు, మంగళ వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణంలో మున్సిపాలిటీ చుట్టుపక్కల నుండి అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేసవికాలం అవడంతో కల్యాణానికి విచ్చేసిన భక్తులకు కులర్లు ఏర్పాటు చేసి చల్లదనానికి నీళ్లు అందజేశారు. ఉదయం ఎదుర్కోళ్లతో మొదలైన వేడుకలు ముత్యాల తలంబ్రాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తుల మద్య సీతారాములు కళ్యాణం నల్ధిగా అనువంశిక అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామనామ స్మరణలతో ఆలయం మార్మోగింది. కల్యాణం  అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

11c64b7c-5180-4f4b-9ea3-2c8314458514

Read More ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన  పద్మశాలి కులస్తులు

ఈ కళ్యాణ మహోత్సవంలో మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్, జిల్లా డిసిసి అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి లు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Read More తీన్మార్ మల్లన్నకు గిరిజన సంక్షేమ సంఘం మద్దతు