భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి జేఏసీ
కార్మికుల స్కీముల మీద పెట్టిన కండిషన్లను లేబర్ డిపార్ట్మెంట్ సర్దిద్దాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ అధ్యక్షులు బి అనంతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డెలివరీ. బెనిఫిట్ .మ్యారేజ్ గిఫ్టులు .డెత్ క్లెయిమ్. యాక్సిడెంట్లు క్లెయిమ్. పేర్ల మీద ఆన్లైన్ చేయాలని అందులో ఉన్న సమస్యలను సరిదిద్దే బాధ్యత అధికారులు మీద ఉండాలని అన్నారు.
జయభేరి, హైదరాబాద్ :
తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. లేబర్ డిపార్ట్మెంటు లో జరుగుతున్న అవకతవకలపై కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
కార్మికుడు పని బంద్ చేసుకొని ఆఫీస్ చుట్టూ తిరగడం వల్ల అప్పుల పాలవుతున్నారని రోజు కూలికి వెళ్తేనే వాళ్ళ పూట గడుస్తుందని అలాంటి వారికి సమస్యలు పరిష్కారం చేసేది పోయి గుదిబండలా అధికారులు మారారని దుయ్యబట్టారు. సమస్యలు పరిష్కరించాలిని అధికారులకు వినతి పత్రం సమర్పించుకున్న కానీ సమస్యలు పరిష్కారం కావడం లేదు ఐదు నిమిషాలు పది నిమిషాలు టైం కేటాయిస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.
Post Comment