TS Inter : ఇంటర్ ఫలితాల్లో ఇంద్రాణి జయ కేతనం
ఉత్తమ ఫలితాలకు కేరాఫ్ గా ఇంద్రాణి జూనియర్ కళాశాల
విద్యార్థులను అభినందించిన కళాశాల చైర్మన్ ఏ. సుదర్శన్
అత్యుత్తమ ఫలితాలకు ఇంద్రాణి జూనియర్ కళాశాల కేరాఫ్ అడ్రస్ గా మారిందని కళాశాల చైర్మన్ ఏ. సుదర్శన్, ఏ. వనజ అన్నారు. తెలంగాణ ఇంటర్ బోర్డ్ బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో పీర్జాదిగూడ నగర పరిధిలోని మల్లికార్జున్ నగర్ ఇంద్రాణి జూనియర్ కళాశాల విజయ దుందుభి మోగించింది. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ఇంద్రాణి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి జయకేతనం ఎగురవేశారు.

సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో.. వి. వర్షిత (986), పి. సాయి కీర్తి (982), ఎన్. భానుచందర్ (982), బైపిసి ఫలితాలలో.. బి. రుత్ ఏంజెలిన్ (954), బి. సిరి చందన (944) మార్కులు సాధించగా, జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో.. సీహెచ్. శివాని (467), జె. ఐశ్వర్య గౌడ్ (466), కిరుమణి ఐనస్ హుస్సేన్ (465), వై తేజిత భరద్వాజ్ (465), ఏ. రజనీకాంత్ (465) మార్కులు సాధించగా, బైపిసి ఫలితాలలో.. కె. నితిక (433), జె. భగవతి (428), ఎం. భవ్య శ్రీ (422), టి. యామిని (419), ఎస్. అక్షయ (418) మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం ఇంద్రాణి జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ ఏ. సుదర్శన్, ఏ. వనజ, ప్రిన్సిపల్ ఎన్. విజయ్ ఆనంద్ అభినందించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. క్రమశిక్షణ కలిగిన విద్యతోనే తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లుగా వెల్లడించారు. రానున్న రోజుల్లో తమ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నంబర్ వన్ స్థానాన్ని సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Post Comment