దేవరయాంజాల్ లో అక్రమ బియ్యం దందా

చాప కింద నీరులా విస్తరిస్తోన్న వైనం.. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు


దేవరయాంజాల్ లో అక్రమ బియ్యం దందా

జయభేరి, జులై 16: గ్రామాల్లో బియ్యం మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తోంది. బ్రాండ్ పేరు చెప్పుకొని ఇష్టా రాజ్యంగా బియ్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మేడ్చల్ జిల్లా తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ లోని జీన్ 3 పుడ్ లో బియ్యం మాఫియా జోరుగా సాగుతుంది. పైన బ్రాండ్ ఒకటి చెపుతూ లోపల మరొక బియ్యం నింపేసి విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు.

అయితే ప్రస్తుత మార్కెట్ లో ఒక్కో బ్రాండ్ కు ఒక్కో ధర పలుకుతుండడంతో ఇదే అదునుగా భావించి కొందరు వ్యాపారులు బ్రాండ్ ల పేర్లను వాడుకుంటూ వాటిని విక్రయిస్తూ ఇష్టారీతిన సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఏవి కల్తీయో ఏవి అసలు బియ్యమో తెలియక అమాయక ప్రజలు మోసపోతున్నారు. ఈ అక్రమ బియ్యం దందా మరింత విస్తరించక ముందే అధికారులు మేల్కొని ఈ దందాకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు.

Read More Telangana I మేయర్, కార్పోరేటర్లంతా రాజీనామా చేసి  ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి..

WhatsApp Image 2024-07-16 at 11.04.02 PM

Read More Media I అమ్ముడుపోతున్న అక్షరం విలువలు కోల్పోతున్న జర్నలిజం...

Views: 0