ఘనంగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సముద్రాల నరహరి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం 

వైద్య ఆరోగ్యశాఖ వృత్తి  దేశ నిర్మాణానికి తోడ్పడుతుంది

ఘనంగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సముద్రాల నరహరి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం 

దేవరకొండ.... వైద్య ఆరోగ్యశాఖ వృత్తి ఎంతో పవిత్రమైందని, ప్రతి ఒక్కరికి సహకరించడంలో  వైద్య ఆరోగ్యశాఖ వృత్తి మరువలేనిదని దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం గౌరవ అధ్యక్షులు పానుగంటి మల్లయ్య, నీల పాండరయ్య  అన్నారు.

శనివారం పట్టణంలోని శ్రీ సాయి పి పి ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన  డిప్యూటీ డీఎంహెచ్వో సముద్రాల నరహరి- రాజేశ్వరిల ఉద్యోగ పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్రాల నరహరి రాజేశ్వరిలను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.  

Read More Telangana I పరీక్షకే..పరీక్ష...

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత 40 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య అభివృద్ధిలో అంకితభావంతో పనిచేస్తూ, ఉన్నత అధికారుల మన్ననలు పొంది  ఉత్తమ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా జిల్లా స్థాయి అవార్డు పొందారని గుర్తు చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో  అత్యుత్తమైన  సేవలు అందించి సమాజానికి బాధ్యత ఊహించే వారని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో సముద్రాల నరహరి సేవలు మరువ లేనివని,తనను ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉందని గుర్తు చేశారు.

Read More Election Bonds I సుప్రీం ఆదేశం.. ఎన్నికల బాండ్లు బయట పెట్టాల్సిందే..

IMG-20240901-WA2205

Read More Telangana MP I టార్గెట్ @17

ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో  కేస రవి,గీతావాణి మాట్లాడుతూ ఉద్యోగ సమయంలో తోటి తోటి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలిగే వారని, క్రమశిక్షణతో విధులు నిర్వహించే వారిని  అన్నారు. పదవీ విరమణ అనంతరం వారి శేష జీవితం సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో  గడవాలని ఆకాంక్షించారు.అనంతరం సముద్రాల నరహరి  రాజేశ్వరిలను గజమాలతో పూలమాలలతో, శాలువులతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Read More Congress I లెక్కలు తేల్చాల్సిందే...

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయo గౌరవ అధ్యక్షులు పానుగంటి మల్లయ్య, నీల పాండురయ్య అధ్యక్షులు చిదేళ్ల వెంకటేశ్వర్లు, కళ్యాణ మండపం అధ్యక్షులు వాస వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఎంహెచ్ఓ కేసర్ రవి, గీతా వాణి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆర్ హరిలాల్,జమాలుద్దీన్, హవీల్ కుమార్,  గోపాల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana I మును గో.. డౌట్..

Views: 1