High Rise Buildings I కోకాపేట సెంటర్‌లో 63 అంతస్తుల ఆకాశహర్మ్యం

ఎత్తైన భవనాలకు కేరాఫ్ హైదరాబాద్

High Rise Buildings I కోకాపేట సెంటర్‌లో 63 అంతస్తుల ఆకాశహర్మ్యం

జయభేరి, హైదరాబాద్:
బహుళ అంతస్థుల భవనాలతో హైదరాబాద్‌కు ఆకాశమే హద్దు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఎత్తైన భవనాలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. తాజాగా కోకాపేట సెంటర్‌లో మరో 63 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని నిర్మించేందుకు నిర్మాణదారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలిసింది. డిజైన్లు, స్థలానికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం పుప్పల్‌గూడలో ‘కందూరు స్కైలైన్‌’ పేరుతో 59 అంతస్తులతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా కోకాపేటలో 'సాస్క్రౌన్' పేరుతో 58 అంతస్తులతో నిర్మిస్తున్న భారీ భవనం నిర్మాణం తుదిదశకు చేరుకుంది.

దేశంలోని 7 ప్రధాన మెట్రో నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ వివిధ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశ రాజధాని ఢిల్లీని వెనక్కి నెట్టి ఆర్థిక రాజధాని ముంబై తర్వాత హైదరాబాద్‌లో ఎత్తైన భవనాలు (హైరైజ్‌లు) ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ గతేడాది ఒక ప్రకటనలో పేర్కొంది. చాలా మంది ప్రజలు ఆఫీసు కార్యకలాపాలపైనే కాకుండా ఎత్తైన భవనాల్లో నివసించడానికి కూడా ఆసక్తి చూపుతుండటంతో, బిల్డర్లు కూడా అద్భుతమైన ఆర్కిటెక్చర్ డిజైన్లతో భవనాలను నిర్మించడానికి ముందుకు వస్తున్నారు.

Read More గురుకుల తరహాలో విద్యాభ్యాసం