ఊసే లేని మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయల ఆర్థిక సాయం మాట
భూమిలేని వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు రూ 12000 ఇస్తామన్న హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి... ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ప్రకటించాలి... తెల్ల రేషన్ కార్డులను తక్షణమే ఇవ్వాలి... బి ప్రసాద్ . రాష్ట్ర ఉపాధ్యక్షులు డిమాండ్.
గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత భూమిలేని వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు రూ 12000, మహిళలకు రూ 2500 , ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్న ఆరు గ్యారెంటీల హామీలలో ఉన్న ముఖ్యమైన వాటిని అమలు చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడకపోవడం ఆందోళన కలిగిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ అన్నారు.
స్థలాలు ఉన్నవారికి ఐదు లక్షలు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామన్న వాగ్దానం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకున్న పేదలకు ఆ భూములపై హక్కు పట్టాలిచ్చి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1,20,000 మంది వ్యవసాయ కూలీలు గ్రామీణ ఉపాధి కూలీలుగా పనిచేస్తున్నారని నాలుగు వారాల పైన కూలీలు చేసిన పనికి వేతనాలు చెల్లించలేదని తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పనిచేసే దగ్గర కనీస సౌకర్యాలు లేవని అన్నారు తాగడానికి మంచినీళ్లు కూడా సరఫరా చేయకపోవడం దుర్మార్గం అన్నారు. ఎస్సీ ఎస్టీల బీడు భూముల అభివృద్ధికి చిన్న సన్నకారు రైతుల భూముల అభివృద్ధికి గ్రామీణ ఉపాధి పనులు పెట్టాలని డిమాండ్ చేశారు.
చౌడు భూములకు చెరువుల వండ్రు మట్టిని సాగుపాములకు ఫ్రీగా తోలాలని, చేసిన పనికి వారం వారం వేతనాలు చెల్లించాలని, పని చూపని దగ్గర నిరుద్యోగ భృతి చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. క్యూబిక్ మీటర్ల కొలతల పేరుతో చట్ట ప్రకారం 300 రూపాయలు వేతనం పడకుండా చేస్తున్నారని పని ప్రదేశంలో ఉదయం సాయంత్రం ఫోటోలు తీసే పేరుతో కూలీలను తీవ్రంగా వేధిస్తున్నారని తక్షణమే ఈ చర్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కూలీలందరకు పారా పలుకు తట్ట గొడ్డలి కొడవలి వంటి పనిముట్లు ఇవ్వాలని కిలోమీటర్లు దాటిన పనికి లోకల్ ఆటో చార్జీ ఇవ్వాలని చట్టంలో ఉన్న అధికారులు అమలు చేయకపోవడం వలన కూలీలు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ఎండలు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని త్రాగడానికి మంచినీరు నీడకు టెంటు మెడికల్ కిట్టు ఇవ్వాలని కోరారు సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్ల బండి శశిధర్, జిల్లా ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ తాడూరి రవీందర్, జిల్లా సహాయ కార్యదర్శి గొర్రె శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్ గుండ్ర రవీందర్, గజిబిన్కర్ బాలకిషన్, శ్రీనివాస్, మల్కనీ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Comment