తీన్మార్ మల్లన్న భారీ విజయానికి అంతా కృషి చేయాలి

పట్టభద్రుల వద్దకే మనం : మాలోత్ రాందాస్ నాయక్ 

తీన్మార్ మల్లన్న భారీ విజయానికి అంతా కృషి చేయాలి

జయభేరి, వైరా : 
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు భారీ విజయాన్ని అందిద్దామని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని కాంగ్రెస్ వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్. 

శుక్రవారం వైరా ఠాగూర్ విద్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రవేట్ ఉపాధ్యాయుల సమావేశంలో ప్రసంగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టభద్రులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ప్రజా గొంతుకను చట్టసభలో వినిపించేందుకు  తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ చేద్దామని  అన్నారు. ప్రతి గ్రామంలో కమిటీగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పట్టభద్రుల ఓట్లు అభ్యర్థించాలని కోరారు.

Read More నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా 

పట్టభద్రుల వద్దకే మనం : మాలోత్ రాందాస్ నాయక్ 
గ్రామ గ్రామాన పట్టభద్రుల వద్దకు వెళ్లి..  కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాల్సిన ఆవశ్యకత వివరిద్దామని ఎమ్మెల్సీ ఎన్నికల వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్. ప్రజా సంక్షేమం కోసం, పట్టభద్రుల వాణి వినిపించేందుకు తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Read More గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి