కుత్బుల్లాపూర్, జగద్గిరి గుట్టలో రోడ్‌షోలో పాల్గొన్న ఈటల రాజేందర్
జయభేరి, కుత్బుల్లాపూర్ :
బీఆర్‌ఎస్ పార్టీ సంగతి మీకు తెలిసిందే. ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలనే కోరికతోనే కేసీఆర్‌ను ఓడించారు. ఇప్పుడు ఈ లోక్‌సభ ఎన్నికలలో వారికి ఓట్లు వేస్తే అవి వృధా అవుతాయి. వారి ఎంపీలు లోక్‌సభకు వెళ్లి ఏమీ చేయలేరు.
ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప ఒడ్డెక్కినాక బోడమల్లప్ప విధంగా ఏ రకమైన ఎన్నికలు హామీలు అమలు చేయలేదు. ప్రతీ మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఇప్పటి వరకూ జరగలేదు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. వృద్ధులకు రూ. 4000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. వికలాంగులకు రూ. 6000 ఇస్తామన్నారు. మహిళా సంఘాలకు రూ. 10 లక్షలు రుణం ఇస్తామన్నారు. కూలీలకు, ఆటో కార్మికులకు పెన్షన్లు ఇస్తామన్నారు. వీటిలో ఏదీ నెరవేర్చలేదు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు మళ్లీ ఎలా వేస్తారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈహామీలు నెరవేర్చగలమని ఇప్పుడు చెప్తున్నారు రేవంత్ రెడ్డి. రాబోయే కాలంలో మల్కాజ్ గిరికి రోడ్లు కావాలన్నా, త్రాగునీరు, డ్రైనేజ్ సిస్టం, ఇండస్ట్రియల్ కారిడార్, రప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. మీ పిల్లలకు సర్కార్ నౌకరీలు కావాలంటే బీజేపీ పార్టీకి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను..
Post Comment