Telangana : మనిషిని మహోన్నతుడిగా తీర్చిది విద్య ఒక్కటే

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Telangana : మనిషిని మహోన్నతుడిగా తీర్చిది విద్య ఒక్కటే

మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒకటే అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. అందరికీ విద్యను అందించేలా కృషిచేసిన మహానీయుడు, తత్వవేత్త, సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా సైనిక్ పూరి, మల్లాపూర్  ఎలిఫెంట్ సర్కిల్ వద్ద జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది పూలే. సామాజిక ఉద్యమాల మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు ఫూలే చదువు లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేనిదే పురోగతి లేదు అనే సత్యాన్ని గ్రహించి 19వ శతాబ్దపు తొలినాళ్లలో నిమ్న జాతుల కోసం, మహిళల కోసం  దేశంలో మొదటిసారిగా పాఠశాలలను ఏర్పరిచిన మహనీయుడు జ్యోతి రావు ఫూలే. విద్యావ్యాప్తి ద్వారా కుల వివక్షతను, సాంఘిక దురాచారాలను, మూడనమ్మకాలను నిర్మూలించేందుకు కృషి చేశారు.

ff7481df-2272-493d-9f8b-e0ec7dc84496

Read More Telangana I యువత ఆలోచన విధానం..!

కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతలకు వివక్షతలకు గురయిన బడుగు, బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, AS Rao Nagar డివిజన్ అధ్యక్షులు కాసం మహిపాల్ రెడ్డి, వంశీ రాజు మల్లేష్, చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు గిరి బాబు, నవీన్ గౌడ్, మహేష్ గౌడ్ కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.

Read More Telangan Sand I తెలంగాణ చరిత్ర, జాతి, ఎన్నటికీ క్షమించదు... ప్రకృతి సంపదను కొల్లగొట్టిన గత ప్రభుత్వపు పాలన...

Views: 1

Related Posts