గురుకుల తరహాలో విద్యాభ్యాసం

  • ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం 
  • పేద విద్యార్థుల అభ్యున్నతికి... దాతల సహకారం అవసరం 
  • డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి 

గురుకుల తరహాలో విద్యాభ్యాసం

జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 30:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు దాతల సహకారం అవసరమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు.

సోమవారం మున్సిపల్ పరిధిలోని క్యాసారం ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కౌన్సిలర్ వంటేరు గోపాల్ రెడ్డిలతో కలిసి దాత కప్ప భాస్కర్ సహకారంతో 50 మంది విద్యార్థులకు దుస్తులు, స్టడీ మెటీరియల్ అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 

Read More మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలం

ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహ అవసరమని, తోటి వారికి చేతనైనంత సహాయం చేస్తే భగవంతుని ఆశీస్సులు మనపై అన్ని రకాలుగా ఉంటాయని స్పష్టం చేశారు. అంతేగాకుండా క్యాసారం పాఠశాల అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని ప్రధానోపాధ్యాయులు రవీందర్రావును కోరారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా పెద్దపీట వేస్తుండగా, విద్యతోనే పేద వర్గాల అభ్యున్నతి సాధ్యపడుతుందని, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గురుకుల తరహాలో విద్యాబోధన అందిస్తున్నట్లు వివరించారు. 

Read More పరిశుద్ధ కార్మికులకు దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలు

ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు గంగిశెట్టి రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు యాదగిరి, కరుణాకర్ రెడ్డి, నర్సింహరెడ్డి, డాక్టర్ వహీద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొనగారి రాజు, రాములు గౌడ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, నాయకులు సురేష్, అంజద్, క్యాసారం బాబా తదితరులు పాల్గొన్నారు.

Read More అంబరాని అంటిన బతుకమ్మ సంబరాలు