డబ్బుకు, మద్యానికి ఆశపడి ఓటు వేయకండి

డబ్బులతో ఓట్లు కొనుక్కుంటున్న కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలు

ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్,బిఆర్ఎస్  డ్రామాలు

విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ

దేశం కోసం ధర్మం కోసం ఓటు వేయండి

మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం కమలం పువ్వుకు గుర్తుకు ఓటు వేయండి

డబ్బుకు, మద్యానికి ఆశపడి ఓటు వేయకండి

జయభేరి, ఘట్కేసర్ : 

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మేడ్చల్ ఎమ్మెల్యే కంటెస్టెడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పత్రిక మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. డబ్బులతో ఓట్లు కొనుక్కుంటున్న బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బులు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ప్రజలు ఎవ్వరూ మద్యానికి డబ్బుకు ఆశపడి ఓటు వెయ్యకూడదని  చైతన్యవంతులై విజ్ఞానంతో దేశం కోసం,ధర్మం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఈటల రాజేందర్ని గెలిపించి ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిని అందజేయాలని నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించారు.

Read More సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు

ఈ కార్యక్రమంలో వెంకటాపురం ఎంపీటీసీ నిరుడు రామారావు ముదిరాజ్,మేడ్చల్ రూరల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు కప్పర గళ్ళ కరుణాకర్, రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు బస్వ రాజు గౌడ్, సీనియర్ నాయకులు గుంగళ్ళ బాలేష్ కురుమ గారి తదితరులు పాల్గొన్నారు.

Read More వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉద్యమ నాయకులు మహ్మద్ అప్జల్ ఖాన్