లాల్ గడి మలక్ పేట్ లో కుక్కల స్వైర విహారం

  • కుక్కల దాడిలో 41 గొర్రెలు మృతి
  • ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుని విన్నపం

లాల్ గడి మలక్ పేట్ లో కుక్కల స్వైర విహారం

జయభేరి, జులై 28: వీధి కుక్కల దాడిలో 41  గొర్రెలు మృత్యువాత పడగా మరో 10 గొర్రెలు గాయపడ్డాయి. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం లాల్ గడి మలక్ పేట్ గ్రామంలో చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన బిట్కూరి నర్సింలు రోజు వారి మాదిరిగా తమ ఇంటి వద్ద గొర్రెలను కట్టివేయగా రాత్రి వేళలో వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ దాడిలో 41 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో 10 గొర్రెలు గాయపడ్డాయి. తాము గొర్రెలను నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, కుక్కల దాడిలో గొర్రెలు మృత్యువాత పడడంతో తాము ఆర్థికంగా నష్టపోయామని తమను ప్రభుత్వం ఆర్తికంగా ఆదుకోవాలని కోరారు.

Read More విద్యాధరి ఆలయంలో మాజీ మంత్రి