సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

ప్రభుత్వ పథకాలను అర్హులైన వారు వినియోగించుకోవాలి - మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

జయభేరి, సెప్టెంబర్ 8:- ప్రభుత్వం నుండి అందించే పథకాలను అర్హులైన వారు వినియోగించుకోవాలని తూంకుంట మున్సిపల్ చైర్మన్ కారంగుల రాజేశ్వర్ రావు సూచించారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను బాధితులకు ఆయన అందచేశారు.

ఈ సందర్భంగా పుణ్యవతి అనే మహిళకు 55 వేలు, ఆలీ అహ్మద్ కు 70 వేలు, ప్రగతి అనే మహిళకు 70 వేలు, దుర్గ  ప్రసాద్ కు 15500 లు, భిక్షపతికి 7500 రూపాయల చెక్కులను మున్సిపల్ చైర్మన్ అందచేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని అన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారు తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Read More జర్నలిస్టుల సంక్షేమం కోసం పని చేస్తాం