మేడిపల్లి బాపూజీ నగర నూతన అధ్యక్షుడిగా బాల్ద వెంకటేష్
మేడిపల్లి అక్టోబర్ 06 : మేడిపల్లి బాపూజీ నగర నూతన అధ్యక్షుడిగా బాల్ద వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో రెండవ డివిజన్ పరిధిలోని బాపూజీ నగర అసోసియేషన్ కార్యాలయంలో నూతన కార్యవర్గం ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాలనీ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని,ప్రధానంగా రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా వంటి వసతులు మెరుగుపరచడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని తెలిపారు. కాలనీ సమస్యలు ఎప్పటికప్పుడు కార్పొరేటర్, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పెద్దలు,సభ్యులు పాల్గొన్నారు.
Read More జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి