అత్యంత ఎత్తైన ప్రదేశానికి దేవరకొండ వాసి అజీజ్

  • హిమాలయాల్లో భారత కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లో ఉన్న ఎత్తైన పర్వత శిఖరం కి చేరిన అజీజ్ కు సోషల్ మీడియాలో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అత్యంత ఎత్తైన ప్రదేశానికి దేవరకొండ వాసి అజీజ్

జయభేరి, దేవరకొండ :
దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్ అత్యంత ఎత్తైన 11649 ఫీట్లు ఎత్తులో గల జోజిలా పాస్ కు చేరుకున్నాడు. ఇది భారతదేశంలోనే పొడవైన రోడ్డు టన్నెల్, అంతేకాకుండ పొడవైన బై డైరెక్షన్ టర్నల్. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని జీరో పాయింట్ అని కూడా పిలుస్తారు. దేవరకొండ నుంచి బైక్ పై కేవలం 6 రోజుల్లో అక్కడికి వెళ్లిన అజీజ్ పర్వతాన్ని అధిరోహించాడు. అంతేకాకుండా జోజిలా టన్నెల్ సోనామార్గ్, కార్గిల్ మధ్యన ఉన్న జోజిలా ఘాట్స్లో సముద్రమట్టానికి 14.2 కిలోమీటర్ల మేర శ్రీనగర్ - లేహ్లను కలుపుతూ 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తుతో రెండు వరుసల్లో నిర్మిస్తున్న టన్నెల్ కావడం విశేషం. హిమాలయాల్లో భారత కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లో ఉన్న ఎత్తైన పర్వత శిఖరం కి చేరిన అజీజ్ కు సోషల్ మీడియాలో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.