ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఏకగ్రీవం 


ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఏకగ్రీవం 

జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 21 : వర్గల్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా బ్రహ్మoడ్లపల్లి వెంకటయ్య గుప్త ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం వర్గల్ లో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ నేతలు హరినాథ్ గుప్త, రంగయ్య గుప్త హాజరయ్యారు. అయితే మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా వెంకటయ్యను ప్రతిపాదిస్తూ సంఘ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ మేరకు మహాసభ ప్రతినిధులు హరినాథ్ గుప్త, రంగయ్య గుప్తలు ఆయనను అభినందిస్తూ నియామక పత్రం అందజేశారు. అనంతరం ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా త్వరలోనే ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుందని అధ్యక్షునిగా ఎన్నికైన వెంకటయ్య గుప్త స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి మూడోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉండగా, సంఘ ప్రతిష్ట, బలోపేతం దిశగా తన వంతు కృషి చేస్తానని వివరించారు.

Read More Modi I అక్టోబరు 2న రాష్ట్రానికి మోడీ

Views: 0