నాయకుల పాత్రికేయుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ఘనంగా శ్రద్ధాంజలి 

నాయకుల పాత్రికేయుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ఘనంగా శ్రద్ధాంజలి 

జయభేరి, దేవరకొండ:
దేవరకొండ లో రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల ఐబీ సెంటర్ వద్ద శనివారం సాయంత్రం వివిధ సంఘాల నాయకులు,పాత్రికేయులు కొవ్వొత్తులతో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. జర్నలిజం, వ్యవసాయం,సినీ రంగాలలో ఎనలేని కృషి చేశారని, ఆయన మృతి తెలుగు రాష్ట్రాలకు తీరనిలోటని అన్నారు. ఈకార్యక్రమంలో Dr. చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, ఏ.చంద్రమౌళి, పగిళ్ల శ్రీనివాస్, పున్న మల్లేష్, నాగయ్య, దేవ్ సింగ్, అజ్మతుల్లా  రాజశేఖర్ సముద్రాల వేణు గాజుల వినయ్, గాజుల అజయ్, తదితరులు పాల్గొన్నారు.