teachers : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వినతి

  • పి ఆర్ సి చైర్మన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి
  • సానుకూలంగా స్పందించిన పి ఆర్ సి చైర్మన్ శివశంకర్

teachers : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వినతి

జయభేరి, మే 16:
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు  పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ బీఆర్ భవన్ లో పి ఆర్ సి చైర్మన్ శివశంకర్ ను మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి కోరారు. ఈ మేరకు  ఉపాద్యాయ సమస్యలపై పిఆర్టియు యూనియన్ తరపున వినతి పత్రం అందజేశారు. అనంతరం కాటేపల్లి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పిఆర్ సి లో అమలు చేయాల్సిన విషయాలపై పూర్తి నివేదికను అందజేశామని చెప్పారు. మాస్టర్ స్కేలు 34,200- 292800 గా నిర్ణయించాలని, ఫిట్మెంట్ 45 శాతంగా నిర్ణయిస్తూ డిఏ 01/07/2023 33.67 శాతంగా ఫిట్మెంట్  చేయాలన్నారు. హెచ్ఎర్ఎ పరిధిని జిహెచ్ఎంసి నుంచి ప్రస్తుతం ఉన్న 8 కిలోమీటర్ల నుంచి 15 కిలో మీటర్లు వరకు పెంచాలన్నారు. 398 సమానవేతనంపై పనిచేసిన స్పెషల్ టీచర్ సర్వీస్ నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరుకు సిఫారసు చేయాలన్నారు.

 ఉద్యోగ విరమణ వయస్సు 61 సంవత్సరానికి పెంచినందున స్టాగ్నెషన్ ఆఫ్ ఇంక్రిమెంట్ 5 నుంచి 8 పెంచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలన్నారు. 50 సంవత్సరాల వయస్సు పూర్తైన వారికి అప్రయత్న పదోన్నతి స్కేలు పొందుటకు డిపార్ట్మెంటల్ పరీక్ష నుంచి మినాహయింపు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్ బిక్షంగౌడ్, మేడ్చల్ జిల్లా అద్యక్షుడు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి రామిడి వెంకట్రామ్ రెడ్డి మల్కాజ్ గిరి అద్యక్షుడు శ్రీనివాస్ రావు, శామీర్ పేట్ అధ్యక్షుడు వెంకటేషం, తదితరులు పాల్గొన్నారు.

Read More Medigadda I మేడిగడ్డ.. బొందల గడ్డ... భాష మార్చుకోకపోతే ప్రజలు చీదరిస్తారు!

Views: 0

Related Posts