4200 కిలోల నల్ల బెల్లం 360 కిలోల పటిక స్వాధీనం
జయభేరి, కొండమల్లేపల్లి :
మండలంలోని చెన్నారం గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, పటిక ను ఆదివారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు దేవరకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ తెలిపారు. వివరాలు కి వెళితే
నల్గొండ జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి బి సంతోష్ ఆదేశాల మేరకు,దేవరకొండ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనబడ్డ ఐచర్ డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 4200 కిలోల నల్ల బెల్లం, 360 కిలోల పటికను, ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గుడుంబా, సారా తయారీలో ఉపయోగించే నల్ల బెల్లం పటిక అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి బి సంతోష్ హెచ్చరించారు.ఎవరైనా అక్రమంగా వ్యాపారం చేస్తే పోలీసు వారికి తెలియపరచాలని ఆయన ప్రజలను కోరారు. సోదాలు నిర్వహించిన వారిలో జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి.సంతోష్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ,సబ్ ఇన్స్పెక్టర్లు ఎ.నరసింహ,పి వీరబాబు, కానిస్టేబుల్స్ మర్ల కృష్ణ, బి కృష్ణ, ఎన్ కృష్ణ పాల్గొన్నారు.
Post Comment