ఈనాడు అధినేత రామోజీరావు కు జయభేరి సంతాపం

ఈనాడు అధినేత రామోజీరావు కు జయభేరి సంతాపం
జయభేరి సంతాపం : 
అతి సామాన్య వ్యక్తిగా జీవితం ప్రారంభించి అనేక రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరిన రామోజీరావు మరణం తీరని లోటు.  వామపక్ష భావజాలం కలిగిన రామోజీరావు  తన జీవితాంతం అత్యంత నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో బతికిన వ్యక్తి. తలపెట్టిన ఏ పనిలో అయినా సరే అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, నైతిక విలువలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడు. పత్రిక, సినిమా, టీవీ తదితర రంగాల్లో రామోజీరావు గారు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తాయి. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు చిరస్మరణీయులు. రామోజీరావు కుటుంబానికి, రామోజీ సంస్థల ఉద్యోగులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
 
- మోతె రఘు తిరుపతి రెడ్డి 
- జయభేరి, ఎడిటర్.