IPL Metro : క్రికెట్ అభిమానులకు మెట్రో యాజమాన్యం శుభవార్త
- ఈరోజున ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది.
హైదరాబాద్, ఏప్రిల్ 25 :
హైదరాబాద్ ప్రజలకు మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఈరోజున ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది. అయితే, మిగతా మార్గాల లో మాత్రం సాధారణ మెట్రో వేళలు కొనసాగుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పొడిగించిన మెట్రో సేవలు అర్ధరాత్రి ఒంటి వరకు అందుబాటు లో ఉంటాయని చెప్పారు.
Views: 0


