లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ

లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ

మేడ్చల్ : మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్ లో గల అక్షర కాలనీలో అర్చన సేవాసమితి అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన లడ్డు వేలం పాటలో అర్చన కాలనీకి చెందిన సాయి కృష్ణ లక్ష 36 వేల రూపాయలకు లడ్డు దక్కించుకున్నారు.

లడ్డు వేలం పాటలో దక్కించుకున్న సాయి కృష్ణ ను కమిటీ సభ్యులు శాల్వాతో సత్కరించి లడ్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు బుచ్చిరాములు, సుధాకర్ చారి, మన్మధరావు, హనుమాన్లు, గంగయ్య, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి, సురేందర్ రెడ్డి,  కమలాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మోహన్ గౌడ్, సత్యనారాయణ, కృష్ణ,, భాస్కర్, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Read More శ్రీ సాయి సన్నిధి వెంచర్ ను ప్రారంభించిన సినీ హీరో  శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్