అంతర్జాతీయ విప్లవ కెరటం చేగువేరా
13-06-202 ఆయన జయంతి
క్యూబా సోషలిస్టు విప్లవంలో తరతరాలుగా చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు చేగువేరా. సామ్రాజ్య వాదానికి సింహస్వప్నంగా నిలిచాడు. అందుకే గొప్ప విప్లవకారుడయ్యాడు. 1928లో జూన్ 14న అర్జెంటీనాలో రోసిరోలో జన్మించాడు. ఇంజనీరింగ్ విద్య చదువుతున్నప్పుడు వ్యాధిగ్రస్తుల బాధలను చూసి చలించిపోయిన చేగువేరా ఇంజనీరింగ్ విద్యని మధ్యలో నిలిపివేసి బ్యూనస్ ఎయిర్స్‌లో వైద్యవిద్య అభ్యసించాడు. చదువు పూర్తయ్యాక లాటిన్ అమెరికా అంతటా పర్యటించాడు. ఉత్తర అమెరికాలో రైతులు, బొగ్గుగని కార్మికులు పీడిత తాడిత ప్రజల దుర్భరమైన జీవితాలను, నరకయాతన చూసి చలించిపోయాడు. అమెరికా సిఐఎ ప్రోద్బలంతో జాకబ్ అర్బంజ్ ప్రభుత్వాన్ని కూల దోసిన తీరు చేగువేరా ప్రత్యక్షంగా కళ్ళారా చూసాడు. మెక్సికో వెళ్లి నియంత బాటిస్టాను కూలదోసేందుకై పోరాడుతున్న క్యూబా విప్లవకారులతో అక్కడే పరిచయాలు పెంచుకున్నాడు.
1959 జనవరి రెండు న కాస్ట్రో గువేరా ను మిలిటరీ కమాండర్ ను చేశాడు .చీఫ్ ఎక్సి క్యూషనర్ అయిన కాష్ట్రో కు కమ్యూనిజాన్ని బోధించాడు. సైనికులకు చదువు చెప్పాడు. 1959 ఫిబ్రవరి ఏడున కాష్ట్రో చేగువేరా కు పౌరసత్వం ప్రదానం చేశాడు .అంతే కాదు డైరెక్టర్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్ర రియన్ రీ ఫామ్స్ అనే పదవి నిచ్చాడు. ఆ తర్వాతా క్యూబా జాతీయ బాంక్ కు అధ్యక్షుడిని చేశాడు. వెంటనే తన మంత్రి వర్గం లో పరిశ్రమల మంత్రి గా తీసుకొన్నాడు. దీనితో బాటు క్యూబా ఆర్ధిక శాఖ కు ఇంచార్జి నీ చేశాడు. క్యూబాలో చెరుకు బాగా పండుతుంది క్యూబా ను ‘’షుగర్ బౌల్ ‘’అంటారు. చెరకు మీదే క్యూబా ఆర్ధికం గా ఆధార పడింది. ఇది అదను గా చేసుకొని అమెరికా పెత్తనం చేస్తోండి. దేశంలో అమెరికా ధనంనం ఎక్కు వై ప్రభావం చూపిస్తోంది. అందుకని రష్యాతో ఒప్పందం కుదిర్చి రష్యాకు పంచ దార ను ఎగుమతి చేయించాడు. వాళ్ళ పెత్తనమూ ఎక్కు వై పోయింది.
1959 జూన్ లో చేగువేరా చైనా కు డిప్లొమాటిక్ యాత్ర చేశాడు ఆధికారికంగా ఆసియా యూరప్,ఆఫ్రికా దేశాలలో పర్యటీంచాడు. 1965 తరువాత క్యూబా కమ్యూనిస్టు పార్టీగా అవతరించింది. 1965లో ఆఫ్రికా వెళ్లి కాంగోలో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. కాంగోలో పాట్సిస్‌లు ముంబా నాయకత్వాన ప్రగతిశీల ప్రభుత్వం ఏర్పడితే అమెరికా దాన్నికూలదోసి ఆయనను హత్య చేయించింది. 1966 నవంబర్‌లో మారువేషంలో ఐరోపా మీదుగా బొలీవియా బయలుదేరి వెళ్లాడు. బొలీవియా వెళ్లే ముందు ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా ప్రజల సంఘీభావ సంస్థను ఉద్దేశించి చేగువేరా ఒక సందేశాన్ని పంపించాడు. చిలీ అర్జెంటీనా, పరుగ్వే సరిహద్దులో గెరిల్లా స్థావరం ఏర్పరుచుకున్న చేగువేరా బొలీవియా సైనిక ప్రభుత్వంపై 11 మాసాలపాటు విప్లవ పోరాటం సాగించాడు.
ఆయన టీంలోని యాభైమందిలో 17మంది క్యూబన్లు ఉండేవారు. చేగువేరా ఎక్కడినుంచి పోరాడుతున్నది ఎవ్వరికీ తెలియదు. చేగువేరా క్యూబా రాయబారిగా, రష్యా, చైనా తదితర అనేక దేశాలు పర్యటించిన ఆయన భారత్‌ను పర్యటించారు. ఆనాటి ప్రధాని నెహ్రూను కలుసుకున్నాడు. బానిసత్వంలో మగ్గిపోతున్న బొలీవియన్లకై పోరాటం చేయాలని చేగువేరా నిర్ణయించుకున్నాడు. చేగువేరా గెరిల్లాలతో ఒక లోయలో ప్రవేశించారు. దీనిని గమనించిన సైన్యం నలువైపులా లోయని చుట్టుమట్టి చేగువెరాను అతి దారుణంగా కాల్చి చంపారు. 1967 అక్టోబర్ 9న అమరుడైనాడు. 39ఏళ్ళకే ఆ విప్ల వజ్యోతి ఆరి పోయింది. తనను చంపినా విప్లవం ఆగి పోదని ధైర్యం గా చెప్పాడు. చేగువేరా ప్రాణాలు కోల్పోయినా అనంతరం ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. 1997 లో అక్టోబర్ 17 న చేగువేరాను క్యూబా శాంతా క్లారా లో మళ్ళీ గౌరవం గా సమాధి చేశారు.