prime minister modi : విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

prime minister modi : విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

జయభేరి, అహ్మదాబాద్ :
గుజరాత్ అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. విమానం కూలిన ప్రదేశానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రికి వెళ్లారు మోదీ. విమాన ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అయితే ప్రధాని వెంట గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్‌ సంఘవి తదితరులు ఉన్నారు.

Views: 0

Related Posts