ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేస్తా...

ఢిల్లీ సీఎం అతీషి

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేస్తా...

జయభేరి, న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 23 : ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీ ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 

ఆ బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కు రాలిగా ఆమె నిలిచారు. ఈ సందర్భంగా ఆమె రామాయణంలో రాముడి కోసం భరతుడు చేసినట్లు తాను ఆపద్ధర్మ ముఖ్య మంత్రిగా పనిచేస్తానని వ్యాఖ్యానించారు.

Read More Arvind Kejriwal I కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటూ.. హర్యానా టు హస్తినపురి...

తన పక్కన ఓ ఖాళీ కుర్చీని ఉంచారు. ఆ కుర్చీలో సీఎంగా కేజ్రీవాల్ మళ్లీ కూర్చుకుంటారన్న సంకేతాలు ఇచ్చారు. రామాయణంలో రాముడి పాదరక్షలు సింహాసనంపై ఉంచి భరతుడు రాజ్యాన్ని 14 ఏళ్ల పాటు పాలించిన విషయం తెలిసిందే. 

Read More Elections 2024 I అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో  అరుణాచల్-సిక్కిం కీలక మార్పు.. ఫలితాల ఎప్పుడంటే?

ఓ కుర్చీని అతిశీ చూపిస్తూ ఇది ముఖ్యమంత్రి సీటని, కేజ్రీవాల్ మళ్లీ సీఎం అయ్యే వరకు ఇది ఖాళీగా ఉంటుందని అన్నారు. దీంతో ఆమెపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. 

Read More Hema Malini : పదేళ్లలో హేమమాలిని ఆస్తులు అన్ని కోట్లకు పెరిగాయా..?

కేజ్రీవాల్ రిమోట్ కంట్రోల్‌ ప్రభుత్వాన్ని నడుపుతారా?అని ప్రశ్నించింది. కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి మిగతా వ్యవహారాలంతా కేజ్రీవాలే చూసుకుంటారని విమర్శించింది.

Read More CBI : కవిత సీబీఐ కస్టడీకి.. సోదరుడు కేటీఆర్‌ను కలిసేందుకు అనుమతించారు

కాగా, ఇటీవలే నిరాడం బరంగా రాజ్ భవన్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది. ఢిల్లీ ముఖ్య  మంత్రిగా అతిశీతో ప్రమాణ స్వీకారం చేయించారు 

Read More FTCCI with the support of MSME I షిప్పింగ్.. లాజిస్టిక్స్‌పై అంతర్జాతీయ సదస్సు

ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా. ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా అతిశీ నిలిచారు. మంత్రులుగా సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్ ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 26-27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీలో అతిశీ బలనిరూపణ చేసుకోను న్నారు.

Read More Whatsapp I వాట్సాప్ నుండి క్రేజీ అప్‌డేట్.. ఇక స్టేటస్ టైమ్ లేదు..

Views: 0

Related Posts