ఢిల్లీ లిక్కర్ కేసు... కవిత బెయిల్ పై నేడు తీర్పు

ఢిల్లీ లిక్కర్ కేసు... కవిత బెయిల్ పై నేడు తీర్పు

న్యూఢిల్లీ :
ఢిల్లీ లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం తీర్పు వెలువడనుంది. రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పును వెలువరించనున్నారు. లిక్కర్ ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో వాదనలు ముగిశాయి. కవిత బెయిల్‌పై రోస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా నేడు తీర్పు వెలువరించనున్నారు. మద్యం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఏప్రిల్ 11న సీబీఐ ఆమెను తిహాద్ జైలులో అరెస్ట్ చేసింది.

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి, ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ కోసం గత నెల 22న రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరగగా, న్యాయమూర్తి కావేరీ బవేజా తొలుత తీర్పును మే 2వ తేదీకి రిజర్వ్ చేశారు. అయితే మేలో తీర్పు వస్తుందని అందరూ భావించారు. 2, ఈడీ కేసులో బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6కి రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో రెండు కేసుల్లోని బెయిల్ పిటిషన్లపై మే 6న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కవితకు బెయిల్ వస్తే.. జ్యుడీషియల్ రిమాండ్ నుంచి మినహాయింపు ఉంటుంది. కోర్టు బెయిల్‌ను తిరస్కరిస్తే కవితను కోర్టులో హాజరు పరచనున్నారు.

Read More వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

Social Links

Related Posts

Post Comment