రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు
జయభేరి, న్యూఢిల్లీ:
జాతీయ రాజకీయ వర్గాలు ఎంతగానో ఎదురుచూస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అన్ని ఊహాగానాలను కొట్టివేస్తూ రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. చాలా చర్చల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. గాంధీ కుటుంబానికి విధేయుడైన అమేథీ నుంచి సీనియర్ నేత కిశోరి లాల్ శర్మ పేరును పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం పేర్లను వెల్లడించారు.
నేడు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో రాహుల్ గాంధీ నేడు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. సోనియా గాంధీ ఇప్పటివరకు రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన నేతలు యూపీని వీడితే అది కాంగ్రెస్ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే అక్కడి నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దింపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీలో సోనియా గాంధీ విజయం సాధించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు.
ఇటీవలే సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ ఇప్పటికే వాయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రెండో విడత పోలింగ్‌లో భాగంగా ఇక్కడ ఎన్నికలు ముగిశాయి.
Read More హత్రాస్ ఘటన... గుండెలు పిండేసే విజువల్స్
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment