పర్యాటకులు, భక్తుల కోసం మే 25 నుంచి భారత్ గౌరవ్ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’
జయభేరి, హైదరాబాద్, మే 3 :
పర్యాటకులు, భక్తుల కోసం ప్రత్యేకించి మే 25 నుంచి 9 రోజుల పాటు భారత్ గౌరవ్ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’కు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు యాత్రలో భాగంగా పర్యాటకులు, భక్తులు తిరువణ్ణామలై (అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు క్షేత్రాలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.పర్యాటకులు సికింద్రాబాద్ స్టేషన్‌తో పాటు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రేణిగుంట స్టేషన్‌లలో దివ్యదక్షిణ యాత్ర రైలులో ఎక్కడానికి, దిగడానికి అవకాశం ఉంటుందన్నారు.
Views: 0


