సీఎం కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బ… బెయిల్ రద్దు

సీఎం కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బ… బెయిల్ రద్దు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ఇచ్చిన బెయిల్‌ను హోల్డ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. నిన్న షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

అయితే కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వడంపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ రద్దు చేయాలని.. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరింది. దీంతో తాజాగా హైకోర్టు కేజ్రీవాల్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను నిలిపివేసింది.

Read More ఆసుపత్రిలో చేరిన ఎల్.కె.అద్వానీ

నిన్న సంబరాలు..

Read More ప్రకృతి ప్రకోపానికి బలి కాకుండా ఏమి చేయాలి...

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది మార్చి 21న లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉంటున్నారు. 

Read More జార్ఖండ్ ముఖ్యమంత్రి విడుదలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ

ఇటీవల లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్‌పై ఆయన బయటికి వచ్చారు. బెయిల్ గడువు ముగిశాక మళ్లీ జైలు అధికారులకు లొంగిపోయారు. అయితే తాజాగా ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. వాస్తవానికి ఈరోజు కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదల అయ్యేది ఉండగా బెయిల్ హోల్డ్ చేయడంతో జైలులోనే సీఎం ఉండనున్నారు.

Read More ప్రభుత్వ ఉద్యోగి అవినీతి..