అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య

శామీర్ పేట్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన రుద్రబోయిన మహేందర్ (35) అదే గ్రామంలో స్క్రాప్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరం 2023 లో శామీర్ పేట్ గ్రామానికి చెందిన దూడల నాగేష్ గౌడ్ అనే వ్యక్తి దగ్గర రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అందులో నుంచి రూ.4 లక్షల 70 వేల రూపాయలను చెల్లించాడు.

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య

జయభేరి, శామీర్ పేట్ : అప్పుల  బాధ తాళలేక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తుర్కపల్లి జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం శామీర్ పేట్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన రుద్రబోయిన మహేందర్ (35) అదే గ్రామంలో స్క్రాప్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరం 2023 లో శామీర్ పేట్ గ్రామానికి చెందిన దూడల నాగేష్ గౌడ్ అనే వ్యక్తి దగ్గర రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అందులో నుంచి రూ.4 లక్షల 70 వేల రూపాయలను చెల్లించాడు.

Read More Police : అక్రమ వడ్డీ , ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల కొరడా..

5c6af415-912c-434d-a07b-c41112b3f7cd

Read More Nagole Murder I నాగోల్ హత్య మిస్టరీ, ముగ్గురు నిందితుల అరెస్ట్

కానీ నాగేష్ గౌడ్ మహేందర్ ను నువ్వు కట్టిన డబ్బులు కేవలం మిత్తి మాత్రమే అని అసలు రూ.6 లక్షల రూపాయలు అలాగే ఉన్నాయని తనకు మొత్తం రూ.6 లక్షలు చెల్లించాలని మహేందర్ ను వేధింపులకు గురి చేసాడు. దింతో మనస్తాపం చెందిన మహేందర్ సూసైడ్ నోట్ రాసి బాధ తో సెల్ఫీ వీడియో తీసుకొని తుర్కపల్లి లోని తన స్క్రాప్ దుకాణంలో దూలానికి నైలాన్ తాడుతో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. బాధితుడి కుటుంబీకులు నాగేష్ వేధింపుల వల్ల నే మహేందర్ ఆత్మ హత్య చేసుకున్నాడని నాగేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమకి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు.

Read More పుట్టిన రోజు వేడుకల పేరుతో వృద్దురాలి పైదాడి

Social Links

Related Posts

Post Comment