పుట్టిన రోజు వేడుకల పేరుతో వృద్దురాలి పైదాడి

బంగారు, వెండి ఆభరణాలు ఆపహరణ

పుట్టిన రోజు వేడుకల పేరుతో వృద్దురాలి పైదాడి

జయభేరి, శామీర్ పేట్ :
పుట్టినరోజు వేడుకల పేరుతో వృద్ధురాలిపై దాడి చేసిన దుండగులు బంగారు,  వెండి ఆభరణాలను అపహారించుకు పోయారు. ఈ సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ గ్రామానికి చెందిన చెవ్వా రాములమ్మ ను గత రెండు రోజుల క్రితం ఇంటిపక్కకు కిరాయి కి వచ్చిన జంట పుట్టినరోజు వేడుకల పేరుతో సోమవారం సాయంత్రం ఇంటికి పిలిచారు. మద్యం మత్తులో రాములమ్మను దించి ఆ పై దాడికి పాల్పడ్డారు. సుమారు 7 తులాల బంగారం,  30 తులాల వెండి ఆభరణాలుతో పరారి ఐనట్లు సమాచారం. దాడిలో గాయపడిన మహిళను ఆర్ వి ఎం అస్పటల్ కి తరలించినట్టు సమాచారం...

Read More BRS I ఎల్బీనగర్ గడ్డ.. ఎవరి అడ్డ!?

Views: 0