ఆలయంలో చోరీ

గుర్తుతెలియని వ్యక్తులు గుడిలో చొరబడి దొంగతనం

ఆలయంలో చోరీ

జయభేరి, మేడ్చల్ :
గుర్తుతెలియని వ్యక్తులు గుడిలో చొరబడి దొంగతనం చేసిన సంఘటన జినమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారంలాల్ గడి మలక్పేట్ మెయిన్ రోడ్డు వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి గుడిలోకి చొరబడి చోరీ చేశారు. దాదాపు కేజీ వెండి దొంగతనం జరిగినట్లు గుడి పంతులు మనోహర్ తెలిపారు. దొంగతనం  సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు పోలీసులు తెలిపారు

Read More చర్లపల్లి రైల్వే స్టేషన్ లో మహిళల మృతదేహం కేసులో పురోగతి!

Views: 0

Related Posts