అనాధ పిల్లల చదువుకు వైష్ణవి ఆర్థిక సహాయం

అనాధ పిల్లల చదువుకు వైష్ణవి ఆర్థిక సహాయం

జయభేరి ప్రతినిధి కైకలూరు : ఇద్దరు అనాధ బాలికల చదువు కోసం అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

గుడివాడకు చెందిన పిరిడి ప్రవల్లిక బి.టెక్ చదువుతుండగా తన చెల్లి తేజస్విని పదవ తరగతి గుడివాడలో చదువుతున్నారు. వారి తండ్రి బ్రెయిన్ క్యాన్సర్ తో మృతి చెందగా అనంతరం తల్లి ఇటీవల మరణించింది. ఇద్దరు బాలికలు అనాధలయ్యారు. ప్రస్తుతం ఇద్దరు అమ్మమ్మ సంరక్షణలో చదువుతున్నారు.

Read More RAGHURAMARAJU I రఘురామరాజుకు నిరాశే!

ఈ సమాచారంతో స్పందించిన ముదినేపల్లికి చెందిన డాక్టర్ మనోజ్ కుమార్తె వైద్య విద్యార్థిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి వారి వద్దకు వెళ్లి 10 వేలు నగదు చదువు కోసం అందజేశారు. గతంలో వారి కుటుంబానికి 5 వేలు అందజేశారు. ఈ కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Read More TDP : డబ్బుకు అమ్ముడుపోతారు.. ఓటర్లు వెధవలు.. వాళ్లను కొనేద్దాం...

Views: 1

Related Posts