శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

జూలై 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.

శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల :
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను గురువారం కు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు జూలై 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.

Read More TDP Chandrababu : డూ ఆర్ డై లా చంద్రబాబు

tirumala-tirupati

Read More జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి టీడీపీ పగ్గాలు...

జూలై 22న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
జూలై 23న అంగప్రదక్షిణం టోకెన్లు….
అక్టోబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….
 శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల ఆన్ లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.

Read More Media : వ్యవసల్థను నిలబెట్టేది మీడియానే...!

జూలై 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
అక్టోబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల…
తిరుమల, తిరుపతిలలో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
జూలై 27న శ్రీవారి సేవ కోటా విడుదల
జూలై 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.

Read More హత్యా నిందితుడికి మళ్ళీ ఎందుకు పట్టం కడుతున్నారు ?

461275-ttd

Read More IAS Committee: MLO కమిటీ నివేదికపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ భేటీ

అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ... అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు.  అక్టోబర్ 11, 12వ తేదీల్లో  సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు. అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్లు రద్దు చేయబడింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Read More జగన్ ఇచ్చిన క్లారిటీ చంద్రబాబు ఇవ్వగలరా?

Views: 0

Related Posts