ఆస్తుల కోసం గొడవలు పెట్టుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు.
సామరస్యంగా పరిష్కరించుకోవాలని, నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని నాకూ తెలుసు. కానీ... కుటుంబ విషయాలను జగన్ రోడ్డు మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు కోర్టు వరకూ తీసుకువెళ్లారు. తల్లినీ, చెల్లినీ కోర్టుకు ఈడ్చడం సాధారణ విషయం కాదు జగన్ సార్!’’
‘కుటుంబ కలహాలు మామూలే’ అని జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘కుటుంబాల్లో గొడవలు సాధారణమే అని జగన్ చెబుతున్నారు. కుటుంబ కలహాలు సామాన్యమేనంటూ తల్లిని, చెల్లిని కోర్టుకెందుకు ఈడ్చారు. ఇది సామాన్యమైన విషయం కాదు జగన్ సార్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Views: 0


