ఫార్మా సిటీ ప్రమాదం
గాయపడిన కార్మికుడిని పరామర్శించిన గండి రవి
జయభేరి, పరవాడ:
పరవాడ ఫార్మాసిటీ కామన్ ఎంప్లాయిస్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లో ప్రమాదంలో తీవ్ర గాయాలు అయి ఆర్లిలోవ అపోలో హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న సబ్బవరం మండలం పైడివాడ ఆగ్రహారం శివారు పీతపాలెం గ్రామ నివాసి కరణం ముత్యాలు ను పరామర్శించి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు పెందుర్తి నియోజకవర్గం వైస్సార్సీపీ నాయకులు గండి రవికుమార్ ధెర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాజమాన్యం బాధితుడికి అన్ని విధాలుగా ఆదుకొని బాధితుడికి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయవలిసిన బాధ్యత యాజమాన్యం తీసుకోవాలని అన్నారు. ఆయనతో పాటు స్థానిక వైస్సార్సీపీ నాయకులు కరణం శ్రీను , దాసరి శ్రీను ,నక్క వాసు, యువజన విభాగం అధ్యక్షులు యడ్ల నాయుడు , ఐ డి బాబు , ఉప సర్పంచ్ సిరపరపు వాసు, కరక రాము, గురి శ్రీనివాస్, పైల రామునాయుడు సిరపరపు నవీన్ ,గండి రవికుమార్ యువ సైన్యం పాల్గొన్నారు.
Views: 0


