పండగ వేళ దుర్గమ్మే ఇంటికి వచ్చిందని...
చెత్త కుండీలో దొరికిన బిడ్డను దత్తత తీసుకున్న ఎస్సై
జయభేరి, లఖ్‌నవూ: ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని సంబరపడతారు. ఆదిపరాశక్తిగా పూజిస్తారు. కానీ భూమ్మీద అడుగుపెట్టిన ఆ పసికందుకు చెత్తకుప్పే దిక్కైంది.
పోలీసుల సంరక్షణలో ఉన్న చిన్నారి కుటుంబీకుల ఆచూకీ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారి వివరాలు తెలియరాలేదు. దీంతో చిన్నారి పరిస్థితిని చూసి..చలించిన సబ్-ఇన్‌స్పెక్టర్ పుష్పేంద్ర సింగ్ దంపతులు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. సింగ్ మాట్లాడుతూ 2018లో తమకు వివాహం అయినా ఇప్పటికీ పిల్లలు లేరని.. విజయ దశమి నాడు స్వయంగా దుర్గమ్మే ఈ చిన్నారి రూపంలో తమ ఇంటికి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.
Read More గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ...