సీమే శాసిస్తుందా...

వైసీపీ గత ఎన్నికల్లో 49  స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి మూడు అంటే మూడు దక్కాయి. అది అసలైన స్వీప్. గతంలో ఉత్తరాంధ్ర, కోస్తాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. కానీ.. ఈ సారి మాత్రం భిన్నమైన రాజకీయం కనిపిస్తోంది. విపక్షాలు కూటమిగా ఏర్పడటం, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్న సమయంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైఎస్ఆర్‌సీపీకి భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది.

సీమే శాసిస్తుందా...

జయభేరి, కడప, మే 20 :
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి. మెజార్టీ మార్క్  సాధించడానికి 88 స్థానాల్లో విజయం సాధించారు. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో వైసీపీ గత ఎన్నికల్లో 49  స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి మూడు అంటే మూడు దక్కాయి. అది అసలైన స్వీప్. గతంలో ఉత్తరాంధ్ర, కోస్తాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. కానీ.. ఈ సారి మాత్రం భిన్నమైన రాజకీయం కనిపిస్తోంది. విపక్షాలు కూటమిగా ఏర్పడటం, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్న సమయంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైఎస్ఆర్‌సీపీకి భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే గతంలో అంత కాకపోయినా రాయలసీమలో గతంలో సాధించిన సీట్లను నిలబెట్టుకుంటే.. అధికారంలో కొనసాగడానికి చాన్స్ లభిస్తుంది. మరి రాయలసీమలో పరిస్థితి అలా ఉందా ?సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం  చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి.  

రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న మూడవ ఎన్నిక ఇది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అధికారం చేజిక్కించుకుంది. 2004లో వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్  రాయలసీమ జిల్లాల్లో 52 అసెంబ్లీ స్థానాలకు గాను 38 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కడపలో 9 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ, ఒక్క అసెంబ్లీ స్థానంలో టిడిపి అభ్యర్థి గెలుపొందారు.   2009లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో ఆరు సీట్లు కోల్పోయి 32 సీట్లను కైవసం చేసుకుంది. టిడిపి బలం పెంచుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో టిడిపి 22 సీట్లు గెలుచుకోగా, వైఎస్ఆర్‌సీపీకి 30 అసెంబ్లీ స్థానాలను గెల్చుకుని బలాన్ని నిూపించుకుంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ రెండు సార్లు ఒక్కటి.. ఒక్క సారి జీరో కు పరిమితమయింది.  

Read More దాదాపు 70 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈనెల 13వ తేదీ ముగిసింది. ఓటర్లు కూడా పోటెత్తారు. ఇప్పుడు వైసీపీ అదే బలాన్ని  నిరూపించుకుంటుందా అన్నది పెను సవాల్ గా మారింది. ఎందుకంటే సొంత సోదరి షర్మిల టీ పీసీసీ చీఫ్ గా బాద్యతలు చేపట్టి వీలైనంత  బలమైన అభ్యర్థులను నిలబెట్టారు. మరో వైపు ఐదేళ్ల పాలనలో రాయలసీమ అభివృద్ధిపై, సాగునీటి ప్రాజెక్టులపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉందని చెబుతున్నారు. రాజధానిని ఎక్కడో విశాఖకు తరలిస్తామని చెప్పడం కూడా మైనస్ గమారింది.  

Read More చిట్టి దోశెలతో రోజుకు 10 వేలు

అదే సమయంలో  "ల్యాండ్ టైటిల్ అంశాన్ని" విపక్షాలుజనంలోకి బలంగా తీసుకువెళ్లారు. ఇవే కాకుండా మిగతా అంశాలు కూటమికి మేలు చేస్తాయని కూటమి నాయకులు విశ్వసిస్తున్నారు. వైసీపీ సంక్షేమ  పథకాలపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఎంత వ్యతిరేక పరిస్థితులు ఉన్నా.. ఎన్నిసీట్లు కోల్పోతే.. అధికారానికి  వైసీపీ అంత దూరంగా జరిగినట్లవుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటం వల్ల రాయలసీమలో పెద్దగా ప్రభావం కనిపించకపోయినా.. ఉత్తరాంద్ర నుంచి  నెల్లూరు వరకూ గట్టి సవాళ్లు ఎదురవుతాయి. చాలా వరకూ నష్టం జరుగుతుందన్న అభిప్రాయం వైసీపీ నేతల్లోనే ఉంది.  

Read More బడులు, దేవాలయాలు సమీపంలో నో వైన్ షాప్: ఎక్సైజ్ కమిషనర్

పోలింగ్ ముగిసిన తర్వాత రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఈ జిల్లాలకు సమీపంలో ఉన్న నెల్లూరు జిల్లాలకు చెందిన నాయకులు విశ్లేషణలో ఉన్నారు. ఏ పార్టీకి ఏ ప్రాంతంలో ఎలా ఓట్లు పోలయ్యాయి. ఎవరికి మేలు చేయ పరిస్థితి ఉందనే అంశాలపై కూడికలు తీసివేతలు వేసుకుంటున్నారు. ఎవరి పరిధిలో వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read More రాజ్యసభలోకి టీడీపీ రీ ఎంట్రీ

అదే సమయంలో పోలింగ్ జరిగిన తీరుపై అధికార పార్టీకి చెందిన అభ్యర్థులే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ కోవలో మంత్రులుగా ఉన్న నేతలు కూడా మాట్లాడడం గమనార్హం. ప్రభుత్వంలో ఉండి కూడా, పాలన వ్యవహారాలు సరిచూసిన వ్యక్తులే పోలీసుల వ్యవహార సరళి, ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కడపలోనూ ఈ సారి గట్టి పోటీ ఉందని ప్రచారం జరుగుతున్న  సమయంలో వైసీపీ అధికారం నిలబెట్టుకుంటామని కాన్ఫిడెంట్ గా ఉంది. అలాంటి  సమయంలో రాయలసీమలో అత్యధిక సీట్లు సాధించడం వైసీపీకి కీలకం. ఎన్ని సీట్లు మైనస్ అయితే.. ఆ పార్టీ అంతగా అధికారానికి దూరమయ్యే అవకాశం ఉంటుంది.

Read More అఖిలేష్ లాబీయింగ్...