అనకాపల్లి జిల్లాలో క్రిమినల్ చట్టాలపై అవగాహన కార్యక్రమం
జయభేరి, అనకాపల్లి:
జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆటో డ్రైవర్లు మరియు స్థానిక ప్రజలకు కొత్తగా అమల్లోకి వచ్చిన భారత క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించే సమావేశం పోలీస్ శాఖవారు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొత్త చట్టాల ముఖ్యాంశాలు, వాటి అమలు విధానం, ప్రజలకు వచ్చే లాభాలు మరియు నిర్లక్ష్యంగా ఉల్లంఘనచేసినట్లయితే ఎదురయ్యే శిక్షలు మొదలైన అంశాలపై వివరంగా చర్చించబడింది. ముఖ్యంగా రోడ్ రూల్స్, ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రత, మైనర్ల రక్షణ, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.కొత్త చట్టాల ద్వారా సాధారణ ప్రజలకు రక్షణ పెరుగుతుంది. ఆటో డ్రైవర్లు ప్రయాణికుల భద్రతకు కట్టుబడి ఉండాలి. అందరూ చట్టాలకు లోబడి క్రమశిక్షణతో ప్రవర్తిస్తే సమాజం మరింత సుస్థిరంగా మారుతుంది అని తెలిపారు.
Views: 1


